ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ప్రజలపై భారాలు మోపడం సరికాదని.. కేసీఆర్​ తుగ్లక్​ విధానాలకు త్వరలోనే చరమగీతం పాడుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్​ వద్ద ఆయన ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం.. ప్రజలపై మోపే అదనపు భారమే ఎల్​ఆర్​ఎస్​ అని దుయ్యబట్టారు.

CLP Leader Mallu Bhatti Vikramarka on LRS Scheme
ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి
author img

By

Published : Oct 5, 2020, 12:38 PM IST

Updated : Oct 5, 2020, 2:43 PM IST

ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలపై భారాలు మోపడానికి.. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి.. ఇలాంటి స్కీమ్​లు ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు.

ఎల్​ఆర్​ఎస్​ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి

ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లాట్​ రిజిస్ట్రేషన్​ చేసినప్పుడు ఫీజు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా ఎల్​ఆర్​ఎస్​ ఫీజు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఎల్​ఆర్​ఎస్​ కట్టకపోతే.. రిజిస్ట్రేషన్లు చేయమని బెదిరించడం సరికాదని.. ప్రభుత్వమే పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారాలు మోపుతున్నారని భట్టి ఆరోపించారు. తుగ్లక్​ విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్​ పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని.. వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే అని.. తెరాస మోపిన అదనపు భారాలన్నీ మాఫీ చేస్తామన్నారు.

Last Updated : Oct 5, 2020, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.