ఆర్థికమంత్రి హరీశ్‌రావు 2021కి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారని... అయితే వాటిని పూర్తిగా ఖర్చుపెట్టాలని కాంగ్రెస్ శాసనసభ పక్షా నేత భట్టి విక్రమార్క కోరారు. బడ్జెట్ ఆమోదం కోసం జరుగుతున్న సాధారణ చర్చలో భట్టి పాల్గొన్నారు. విద్య, వైద్యం, రోడ్డు-రవాణా, గ్రామీణాభివృద్ధివంటి ప్రాధాన్యత రంగాలకు అనుకున్న మేర కేటాయింపులు బడ్జెట్‌లో చేయలేదని ఆరోపించారు.
దేశ సగటుతో పోలిస్తే తక్కువగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగ రేటు రాష్ట్రంలో ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నా... ఉపాధి కల్పనలో ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై సభలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. వాస్తవాలకు దూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఆదాయానికి-ఖర్చులకు మధ్య ఏ మాత్రం పొంతన లేదని అన్నారు.
- ఇదీ చదవండి : కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్ రావు