ETV Bharat / state

రాత్రి కర్ఫ్యూ వల్ల ఒరిగేదేం లేదు: భట్టి విక్రమార్క

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ప్రయోజ‌న చర్యగా ఆయన అభివర్ణించారు

Clp leader bhatti
రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 20, 2021, 7:23 PM IST

కొవిడ్ మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఇవాళ్టి నుంచి విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల ఒరిగేదేమి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ప్రయోజ‌న చర్యగా ఆయన అభివర్ణించారు. జనసంచారం తక్కువగా ఉండే సమయంలో కర్ఫ్యూను పెట్టడం వల్ల కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరిస్తారో అర్థం కావడం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీరు చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ శాసనసభ పక్షం తరఫున కరోనా విషయమై ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టిందని విమర్శించారు. పబ్‌లు, క్లబ్‌లు, లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు, మాల్స్, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్ల ద్వారానే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కూడా తెలియజేసినట్లు తెలిపారు.

కంటి తుడుపు చర్య...

ప్రస్తుతం పరిస్థితులు విషమించగా కంటితుడుపు చర్యగా జనసంచారం ఎక్కువగా ఉండని రాత్రి వేళల్లో కర్ఫ్యూను విధించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మెల్కొని అందరి సలహాలు, సూచనల మేరకు కరోనా నియంత్రణలో తగిన చర్యలను తీసుకోవాలన్నారు. రాత్రి పూటనే కాకుండా పగలు కర్ఫ్యూ కూడా విధించాలని లేదంటే 144 సెక్షన్ పెట్టి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స కోసం అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారని దీనిని అరికట్టేందుకు వేసిన టాస్క్​ఫోర్స్ కమిటీ సరిగ్గా పని చేసేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా బారినపడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.