Bhatti on drugs: డ్రగ్స్ కేసు సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వానికి భయమెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రం తెచ్చుకున్నది మద్యం విచ్చలవిడిగా అమ్మేందుకు కాదన్నారు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పబ్‌లలోకి మైనర్లకు అనుమతి ఎలా ఇచ్చారని భట్టి ప్రశ్నించారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాక చర్యలకు జాప్యమెందుకని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. హోంమంత్రిని కలిసేందుకు వెళ్లిన మా మహిళా నాయకులను అడ్డుకుంటారా? అని భట్టి ప్రశ్నించారు. విపక్షాల కట్టడికి ఈడీ వంటి సంస్థలను వాడటం దుర్మార్గమని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీని ఇబ్బంది పెడితే.. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. కుట్రపూరితంగా సోనియా, రాహుల్‌కు ఈడీ నోటీసులిచ్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. చరిత్ర తెలుసుకోకుండా మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మేందుకు కాదు కదా? చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకోలేరా? పబ్‌ల్లో మైనర్లను అనుమతి లేదు.. మరీ ఎలా ఇచ్చారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నగరాన్ని అడ్డాగా మార్చారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ఆలస్యమెందుకు జరిగింది. కచ్చితంగా ఈ ఘటనపై సీబీఐ విచారణ జరగాలి. బాధ్యత కలిగిన ఎంత స్థాయిలో ఉన్నవారైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే. - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
జూబ్లీహిల్స్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. క్రైమ్ హైదరాబాద్‌కే కాదు.. తెలంగాణ అంతా పాకిపోయిందన్నారు. అధికారులపై ఒత్తిడి పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వామన్‌రావు హత్యపై సీబీఐ విచారణ ఆడిగినా ఇంతవరకు స్పందన లేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని నడుపుతోందని శ్రీధర్‌బాబు విమర్శించారు.
ఇవీ చూడండి: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోలీసులకు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట
బిడ్డకు జన్మనిచ్చిన నాలుగో రోజే.. భార్యను గొంతునులిమి చంపిన భర్త.