ETV Bharat / state

Bhatti Vikramarka : హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలన్నీ అబద్ధం.. అసలేం జరిగిందంటే..: భట్టి - Bhatti Vikramarka on huzurabad review

హుజూరాబాద్​ ఫలితంపై నిన్న దిల్లీలో జరిగిన ఏఐసీసీ సమీక్ష(AICC review on huzurabad defeat) అర్థవంతంగా సాగిందని సీఎల్పీ నేత(CLP leader Bhatti Vikramarka) భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. సమావేశం తర్వాత తాము మీడియాకు చెప్పిందే నిజమని చెప్పారు. గాందీభవన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టతనిచ్చారు.

Bhatti Vikramarka
భట్టి విక్రమార్క
author img

By

Published : Nov 14, 2021, 2:24 PM IST

Updated : Nov 14, 2021, 7:12 PM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka on huzurabad review) అన్నారు. హుజూరాబాద్​ ఫలితంపై నిన్న దిల్లీలో ఏఐసీసీ సమక్షంలో జరిగిన సమావేశం(AICC review on huzurabad defeat) .. అర్థవంతంగా జరిగిందని భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) అన్నారు. హూజూరాబాద్‌ సమీక్షపై వచ్చిన ఏవార్తలో నిజం లేదని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. గాంధీ భవన్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(TPCC president Revanth Reddy) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

హుజురాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదు: భట్టి

ఒక జాతీయ పార్టీ గురించి ఇలాంటి కల్పిత కథనాలు రాయడం సమంజసం కాదని భట్టి అభిప్రాయపడ్డారు. సమీక్ష అనంతరం నిన్న సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో జరిగినవే నిజమని చెప్పారు. కల్పిత కథనాలు ప్రచురితం కాకుండా మీడియా మిత్రులు సహకరించాలని కోరారు. సమస్యలపై కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌ ఫలితంపై దిల్లీలో ఏఐసీసీ సమీక్ష అర్ధవంతంగా జరిగింది. హుజూరాబాద్ సమీక్షపై వచ్చిన వార్తలు నిజం కాదు. సమావేశం తర్వాత మేము మీడియాకు చెప్పిందే వాస్తవం. ఒక జాతీయ, రాజకీయ పార్టీపై ఇలాంటి కల్పిత కథనాలు రాయడం సమంజసం కాదు. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

నెహ్రూకు నివాళులు

ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని భట్టి(Bhatti Vikramarka) అభిప్రాయపడ్డారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా దేశ స్వాతంత్ర్యం కోసమే జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru jayanthi) వదులుకున్నారని పేర్కొన్నారు. నెహ్రూ వేసిన పునాదులే ఈ దేశం ఇంత బలంగా నిర్మాణం అవ్వడానికి కారణమని ఆయన కొనియాడారు. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ నెహ్రూ(Jawaharlal Nehru jayanthi)కు నివాళులు అర్పించాలని చెప్పారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి సంబంధం లేని వారిని స్వాతంత్ర్య పోరాట యోధులుగా చూపుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: Revanth Reddy on KCR: రైతులపై ఎందుకంత నిర్లక్ష్యం.. భాజపా, తెరాసలది ఓ నాటకం

KTR letter to Piyush Goyal: 'సిరిసిల్లలో మెగా పవర్​ లూమ్​ క్లస్టర్ ఏర్పాటుకు నిధులివ్వరా..?'

Bandi Sanjay at Banjara Utsavam: అధికారంలోకి వచ్చాక తండాలను అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్

Last Updated : Nov 14, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.