ETV Bharat / state

'మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి' - parties that are squabbling the people

కులాలు, మతాలు, మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్న పార్టీలకు బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మోదీ హయాంలో దేశంలో మహిళలకు భద్రత లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆరోపించారు. స్వర్గీయ రాజీవ్‌ గాంధీ, శ్యామ్‌ పిట్రోడాల సేవల గురించి వారు గుర్తు చేసుకున్నారు.

clp leader bhatti said We need to warn the parties that are squabbling among the people
'మనుషుల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి'
author img

By

Published : Oct 19, 2020, 5:03 PM IST

దేశంలో మతాల మధ్య చిచ్చు ఏర్పడకుండా ఆపాల్సిన పాలకులే ఇప్పుడు మతాలు, కులాలకు చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్న పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు. దేశంలో సాంకేతిక విప్లవం గురించి మాట్లాడాల్సి వస్తే.. స్వర్గీయ రాజీవ్‌ గాంధీ, శ్యామ్‌ పిట్రోడాల గురించి మాట్లాడకుండా ఉండలేమని ఆయన పేర్కొన్నారు.

21వ శతాబ్దంలో అభివృద్ధి గురించి 30 ఏళ్ల కిందనే ఆలోచించిన మహనీయులు వారని కొనియాడారు. దేశంలో మత హింసలు చెలరేగినప్పుడు, మనుషుల మధ్య విభేదాలు వచ్చినపుడు ఇలాంటి యాత్రలు తత్సంబంధాలు పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు.

దేశమంతా మత కల్లోలం ఉన్నప్పుడు 1990లో చార్మినార్ నుంచి స్వర్గీయ రాజీవ్​గాంధీ సద్భావన యాత్ర నిర్వహించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. ఇందిరమ్మ ఉన్నంత కాలం దేశంలో మహిళలు ఎంతో దైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

నేడు మోదీ హయాంలో దేశంలో మహిళలకు భద్రత లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారని అన్నారు. ఈనెల 31న దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని సోనియా గాంధీ చెప్పినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.