ETV Bharat / state

'ప్రభుత్వ అలసత్వం వల్లే.. ఇంకా ఎక్కువ నష్టం'

BHATTI: రాష్ట్రంలో వరద నష్టంను అంచనా వేయటంలోనూ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. వరద నష్టంపై ఇప్పటివరకు ప్రభుత్వం అంచనా వేయలేదని తెలిపారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క
author img

By

Published : Aug 8, 2022, 5:18 PM IST

' వరద నష్టం అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలం'

BHATTI: రాష్ట్రంలో వరద నష్టంను అంచనా వేయటంలోనూ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు. గత ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేవని భట్టి గుర్తు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ శాసనసభా పక్షం భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి రెండు మూడు రోజులు భద్రాచలంలో సీఎల్పీ బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

కడెం ప్రాజెక్టును కూడా సందర్శించనున్నట్లు భట్టి తెలిపారు. కాళేశ్వరం ముంపు, సీతారామ ప్రాజెక్ట్​తో పాటు ఇతర ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటించి జరిగిన నష్టంపై పోరాడుతుందన్నారు. స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్​పైనే కక్ష్యకట్టారని ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారని మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ప్రతి జిల్లాలో.. 75కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని సీఎల్పీ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. 75వ స్వాతంత్య్ర వేడుకల్లో అందరూ పాల్గొనాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

"వరదలు, వరదల వల్ల జరిగిన నష్టంను అంచనా వేయటంలోనూ ప్రభుత్వం విఫలమైంది. అంచనాలు వేయకుండా జాప్యం చేస్తుంది. ఆ ప్రాంతాల్లో సీఎల్పీ బృందం పర్యటిస్తారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9నుంచి 15వ తేదీ వరకు ప్రతి జిల్లాలో.. 75మంది నేతలతో 75కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయించాం. స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్​పైనే కక్ష్యకట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌కు తాళం వేశారు. సోనియాగాంధీని, రాహుల్​గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు." - భట్టి విక్రమార్క సీఎల్పీ నేత

ఇవీ చదవండి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్​

'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.