ETV Bharat / state

రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ - Telangana letter to Krishnanadi Board

రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ ముగిసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను గవినోళ్ల శ్రీనివాస్ వేశారు.

రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ
రాయలసీమ ఎత్తిపోతలపై ముగిసిన విచారణ
author img

By

Published : Feb 24, 2021, 1:15 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి ఉల్లంఘనలపై నిజనిర్దరణ కమిటీ వేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయరాదన్న ఆదేశాలను ఉల్లంఘించి... ఏపీ సర్కార్‌ పనులు కొనసాగిస్తోందని దాఖలైన పిటిషన్‌పై చెన్నై బెంచ్‌ విచారణ జరిపింది. ఈ విచారణలో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేయరాదని.. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేస్తున్నారని పిటిషన్‌ వివరించారు.

ఈ వాదనతో విబేధించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఎలాంటి పనులు సాగడంలేదని గతంలోనే సీఎస్‌ అఫడవిట్‌ వేసినట్టు తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఎన్జీటీ... రాయలసీమ ఎత్తిపోతలపై ఉల్లంఘనలు జరుగుతున్నాయో లేదో తేల్చేందుకు.. నిజ నిర్దరణ కమిటీ వేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై. త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కృష్ణాబోర్డు వేసే కమిటీ అధ్యయనం తర్వాత.. మళ్లీ రావొచ్చని పిటిషనర్‌కు సూచిస్తూ ఎన్జీటీ విచారణను ముగించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.