ETV Bharat / state

'ప్రాధాన్యత క్రమంలో హెచ్​సీక్యూ తయారీకి అనుమతి'

కరోనా చికిత్సలో ఉపయోగిస్తోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, వాటి ఇంటర్మీడియరీలను తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత క్రమంలో కంపెనీలకు అనుమతులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది.

Clearances_On_Priority_Basic_For_HCQ
'ప్రాధాన్యత క్రమంలో హెచ్​సీక్యూ తయారీకి అనుమతి'
author img

By

Published : Apr 26, 2020, 6:14 AM IST

కరోనా చికిత్సలో వాడుతున్న విస్తృతంగా వినియోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​ తదితర మందులు, వాటి ఇంటర్మీడియరీలను తయారు చేసేందుకు దరఖాస్తు చేసుకునే కంపెనీలకు ప్రాధాన్యత క్రమంలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) తెలిపింది.

కొవిడ్​ కట్టడికి ఉపయోగపడుతున్న మెడిసిన్​ తయారీ గురించి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించింది. వివిధ బల్క్​ డ్రగ్​లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు వీటిని తయారీ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని కంపెనీలు ఈ మందులు తయారీ కోసం ముందుకొస్తున్నట్లు పీసీబీ తెలిపింది.

ఇదీ చూడండి: ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.