ETV Bharat / state

CJI NV RAMANA TOUR: కోర్టులు ఆధునికం కావాలి.. అప్పుడే సత్వర న్యాయం: సీజేఐ - వరంగల్​లో సీజేఐ

కోర్టులను ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆదివారం వరంగల్‌లో ‘పది కోర్టుల భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మతో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయస్థాన భవనాల సముదాయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

cji nv ramana
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ
author img

By

Published : Dec 20, 2021, 4:51 AM IST

కోర్టులను ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థకు సంబంధించి పలు సమస్యలపై కేంద్రానికి లేఖలు రాసినా ఇంతవరకూ సరైన స్పందన లేదని చెప్పారు. ఆదివారం వరంగల్‌లో ‘పది కోర్టుల భవన సముదాయం’ ప్రారంభోత్సవానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మతో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయస్థాన భవనాల సముదాయాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

‘‘కోర్టుల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ‘భారత మౌలిక వసతుల సంస్థ’ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, న్యాయ మంత్రిత్వశాఖకు జులైలోనే లేఖ రాసినా.. ఫలితం లేదు. ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో దీన్ని చట్టం రూపంలో తీసుకొస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నా. కొవిడ్‌ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో తాలుకాల్లోని కోర్టుల్లో మొబైల్‌ వ్యాన్‌ కోర్టుల ఏర్పాటుపై లేఖ రాసినా, కొవిడ్‌తో నష్టపోయిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేయాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదు. వరంగల్‌ నుంచి కూడా సుప్రీంలో కేసు వాదించే అవకాశం వీడియో కాన్ఫరెన్స్‌ సాంకేతికతతో ఉంది. కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ సిస్టం ఏర్పాటు చేయాలని, లేదంటే చాలామంది పేద న్యాయవాదులు తమ వృత్తిని కోల్పోతే ఒక తరానికి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పా. అవసరమైతే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి తాలుకాకు ఒక మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యాన్‌ పెడితే న్యాయవాదులు అక్కడికి వచ్చి వాదనలు వినిపించే అవకాశం ఉందని సూచించా. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. న్యాయస్థానాల్లో సరిపడా న్యాయమూర్తుల నియామక, మౌలిక వసతుల కల్పన, న్యాయవాదులకు ఆర్థిక సాయం.. ఈ మూడు సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’’- జస్టిస్‌ ఎన్‌వీ రమణ , సీజేఐ

పోక్సో కోర్టును ప్రారంభిస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ.

పక్కన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్‌ నవీన్‌రావు

నా కలలకు ప్రతిరూపంగా కోర్టు నిర్మాణం..

వరంగల్‌ న్యాయపరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు ప్రత్యేక శ్రద్ధతో వరంగల్‌లో కోర్టు నూతన భవన నిర్మాణానికి కృషిచేశారు. నేను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో శిథిలావస్థలోని కోర్టులను పునర్నిర్మించి, వసతుల కల్పనకు కృషి చేస్తున్నా. వరంగల్‌ కోర్టు నిర్మాణం నా కలలకు ప్రతిరూపంగా జరిగింది. ఇక్కడి ఏర్పాట్లను పుస్తకం, వీడియోలుగా రూపొందిస్తే మిగతా రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు పంపించి దీన్నో నమూనాగా తీసుకోవాలని చెబుతా.. అన్నారు జస్టిస్‌ రమణ.

సాహిత్యానికి పెద్దపీట

తెలుగు భాష, సంస్కృతిని అమితంగా అభిమానించే జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన ప్రసంగంలో సాహిత్యానికి పెద్దపీట వేశారు. అచ్చతెలుగులో ప్రసంగించారు. ‘తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెప్పుట సిగ్గులేదెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ నా గొడవలోని కవితా పంక్తులతో పాటు.. ‘ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజుమాకెన్నడేని, తీగలను తెంపి అడవిలోకి దింపావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను ఉటంకిస్తూ.. పోరుగల్లుకు వందనం, ఓరుగల్లుకు వందనం, వరంగల్లుకు వందనం.. అంటూ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు. ‘కాకతీయ కీర్తి కమనీయమైన కాంతిపుంజమై వెలుగు దారులు చూపి నడిపించు ఆంధ్రులకు కాకలు తీరిన యోధుల కన్నెదరిమ కర్పూరపు పరిమళమై కాలమంత వ్యాపించె, కళలు నిండిన ఓరుగంటి పట్టణం, కలల ఫలమై నిలిచె కనులకు కట్టినట్టు కనిపించె నాటి వైభవ చిత్రాలివి, నేటికీ ఈనాటికీ మదిగెల్చు చరిత్ర సాక్ష్యాలివే’ అంటూ గుక్క తిప్పుకోకుండా జస్టిస్‌ ఎన్‌వీ రమణ కవితను చదవడంతో సభ చప్పట్లతో మార్మోగింది. వరంగల్‌ దేశానికి ప్రధానమంత్రిని అందించిందంటూ పీవీని స్మరించుకున్నారు. రామప్ప దివ్య క్షేత్రం అద్భుతమని సీజేఐ కొనియాడారు. కాకతీయ రాజుల ఘనమైన వారసత్వ కట్టడాలకు దీటుగా నేడు కోర్టు భవనం నిర్మించారని ప్రశంసించారు. వరంగల్‌లో తనకు బంధువులు, మిత్రులు ఉన్నారని.. ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందని.. గతంలో సాహిత్య సదస్సులకు హాజరయ్యానని చెప్పారు. ‘మాతృభాషలో మాట్లాడండి.. మాతృమూర్తిని ప్రేమించండి.. మాతృభూమిని అభిమానించండి. ఇంట్లో పిల్లలు తెలుగులోనే మాట్లాడేలా చూడండి..’ అంటూ జస్టిస్‌ ఎన్‌వీ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.

భద్రకాళి ఆలయంలో ఆశీర్వచనం అందుకుంటున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ దంపతులు

రాష్ట్రమంతటా ఉండాలి

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్మించిన కోర్టు భవనం తరహాలో రాష్ట్రంలోని అన్ని కోర్టులు ఉండాలని ఆకాంక్షించారు. అడ్వొకేట్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం చెప్పి కోర్టు నిర్మాణాలకు కావాల్సిన నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఆదివారం ఉదయం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ దంపతులు భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం..

వరంగల్‌ న్యాయస్థానంలోని 23 కోర్టుల్లో 71,248 కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక కేసు రెండో సబ్‌ కోర్టులో ఏకంగా 1984 నుంచీ అపరిష్కృతంగా ఉంది. పెండింగు కేసులు పెరిగిపోవడానికి జడ్జిల కొరత ఒక్కటే కారణం కాదు.. సరైన మౌలిక వసతులు లేని కోర్టుల్లో న్యాయమూర్తులు పనిచేయాలనుకోవడం దురాశే. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఇక్కడి కోర్టు భవన సముదాయాన్ని రాష్ట్ర నిధులతో నిర్మించడం తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.