ETV Bharat / state

రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం - telangana varthalu

సీజేఐగా తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్​ ఎన్​వీ రమణ శంషాబాద్​ విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్​భవన్​కు వెళ్లారు. ఆయనకు గవర్నర్ తమిళి సై​, సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు.

cji
cji
author img

By

Published : Jun 11, 2021, 5:41 PM IST

Updated : Jun 11, 2021, 6:58 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జస్టిస్​ ఎన్​వీ రమణ రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకున్న ఆయన... నేరుగా రాజ్​భవన్​కు తరలివెళ్లారు.

రాజ్‌భవన్‌లో​ సీజేఐ జస్టిస్‌ ఎన్​వీ రమణకు గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​, సీఎం కేసీఆర్​ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మూడురోజుల పాటు జస్టిస్ ఎన్​వీ రమణ రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. ఈ 3 రోజులు పలు కార్యక్రమాలు, సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. రాజ్​భవన్​లో కార్యక్రమ అనంతరం ఎస్ఆర్​ నగర్​లోని బాపు నగర్​లో గల ఆయన స్వగృహానికి వెళ్లారు.

స్వగృహానికి బయలుదేరిన జస్టిస్​ ఎన్​వీ రమణ

అంతకు ముందు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్​, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్ అలీ సహా హైదరాబాద్‌ మేయర్ విజయలక్ష్మీ ఘనంగా ఆహ్వానం పలికారు. ఆ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సీజేఐగా తొలిసారి హైదరాబాద్​కు జస్టిస్​ ఎన్​వీ రమణ

Last Updated : Jun 11, 2021, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.