ETV Bharat / state

Civils Coaching: అర్హులైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్: బుర్రా వెంకటేశం - బీసీ స్టడీ సర్కిల్

దేశంలో అత్యున్నత సర్వీసులకు నిర్వహించే సివిల్స్​ మెయిన్స్(civils mains exam)​ పరీక్షకు ఉచిత కోచింగ్​ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రిలిమ్స్ పాసై ఆసక్తి గల అభ్యర్థులు తమ వెబ్​సైట్​లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Civils mains free coaching
సివిల్స్​ మెయిన్స్​ పరీక్షకు ఉచిత కోచింగ్​
author img

By

Published : Nov 7, 2021, 5:18 PM IST

సివిల్స్ ప్రిలిమ్స్(civils prelims exam) ఉత్తీర్ణులైన బీసీ యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మెయిన్స్​కు(mains) అవసరమైన కోచింగ్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పరీక్షకు సిద్దం కావడానికి అర్హులైన అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

సివిల్స్-2021లో ప్రిలిమ్స్​లో అర్హత సాధించిన బీసీ యువత ఈ నెల 15వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్​కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉచిత కోచింగ్ కోసం tsbcstudycircle.cgg.gov.in వెబ్​సైట్​లో తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు రెండు పాస్​పోర్ట్​ సైజ్ ఫోటోలు జత చేయాలని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఫోన్‌ నెంబర్‌ 040- -24071178లో సంప్రదించాలని బుర్రా వెంకటేశం వివరించారు.

ఇదీ చూడండి:

Telangana Assembly Sessions 2021: బీసీ కులగణనపై అసెంబ్లీలో సీఎం తీర్మానం.. ఏకగ్రీవ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.