కరోనా విపత్తు వేళ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రోజుకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని... పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తైన 7 జిల్లాల్లో 308 కేంద్రాలను కూడా మూసివేశామని ప్రకటించారు.
రాష్ట్రంలో చాలా చోట్ల రైస్ మిల్లుల్లో హమాలీలు, లారీల కొరత దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు మారెడ్డి తెలిపారు. కొన్ని జిల్లాల్లో నగదు చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే స్పందించి పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించామని తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్రానికి ఆర్బీఐ రూ.లక్ష కోట్లు- ఇంత భారీగా ఎందుకు?