ETV Bharat / state

విపత్తు వేళ అన్నార్థుల ఆకలి తీర్చుతున్న నటుడు జీవన్‌

కరోనా కష్టకాలంలో అన్నార్థుల ఆకలి తీర్చేందుకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు కష్టాల్లో ఉన్నవారి కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు జీవన్‌కుమార్ తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నారు. సినిమాల్లో నటించగా వచ్చిన నగదును కరోనా బారినపడిన వారితో పాటు పేదల ఆకలి తీర్చేందుకు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో రోజుకు వందలాది మందికి ఆహారం పంపిణీ చేస్తూ... మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

actor jeevan
విపత్తు వేళ అన్నార్థుల ఆకలి తీర్చుతున్న నటుడు జీవన్‌
author img

By

Published : May 17, 2021, 3:16 AM IST

విపత్తు వేళ అన్నార్థుల ఆకలి తీర్చుతున్న నటుడు జీవన్‌

తనదైన నటనతో ఇటీవల సినిమాల్లో వరసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జీవన్‌కుమార్‌.... తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యారు. ఇటీవల బంపర్‌హిట్‌ అయిన జాతిరత్నాలతోపాటు... విరాటపర్వం, పుష్ప చిత్రాల్లో జీవన్‌ నటిస్తున్నారు. రెస్టారెంట్‌ వ్యాపారంలో అనుభవమున్న జీవన్.. గతేడాది లాక్‌డౌన్ వేళ వేలాది మంది నిరుపేదలకు తన చార్‌కోల్ రెస్టారెంట్ నుంచి ఆహారం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్‌ పరిస్థితుల్లోనూ జీవన్‌ తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల్లోని గర్భిణీలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కరోనా రోగులకు భరోసా కల్పిస్తున్నారు.

ప్రత్యేక సంస్థ ఏర్పాటు

తన పేరుతో మెయిల్ ఐడీ క్రియేట్ చేసిన జీవన్‌.. ముగ్గురు స్నేహితుల సహకారంతో ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేశారు. మెయిల్‌తోపాటు వాట్సాప్‌కు వచ్చే అభ్యర్థనల ఆధారంగా ఆహారాన్ని తయారు చేసి... సకాలంలో సరఫరా చేస్తున్నారు. శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని కరోనా బాధితులకు ఉచితంగా రెండు పూటలా సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల వద్ద రోగుల బంధువులకు ఆహారం అందజేస్తున్నారు. ఇలా రోజుకు 300 మందికిపైగా ఉచితంగా భోజనం పంపుతూ... విపత్తు వేళ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. లింగంపల్లి వద్ద ఓ నిరుపేద గర్భిణీ అనుభవించిన వేదన తనను తీవ్రంగా కలిచివేసిందని... ఆ ఘటనతోనే తాను సంపాదించే ప్రతి పైసా తోటివారి ఆరోగ్యం కోసం ఖర్చుపెడుతున్నట్లు జీవన్‌కుమార్ చెబుతున్నారు.

గ్రామాన్ని దత్తత తీసుకుని...

కరోనా రెండో దశ వ్యాప్తి ఆరంభంలో పలు ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసిన జీవన్... షాద్‌నగర్ ప్రాంతంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు సహా ఇతర మందులను పంపిణీ చేశారు. భద్రాది కొత్తగూడెం సహా చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల ప్రజలకు సుమారు 10 వేల క్వింట్లాళ్ల బియ్యాన్ని సరఫరా చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారాన్ని, మాస్కులను అందజేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తానని జీవన్‌ చెబుతున్నాడు. జీవన్‌కుమార్‌ కృషి పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: నేడు రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.