ETV Bharat / state

ఏపీలోని చిన్నారి కేసు... చాక్లెట్ ఆశ చూపి... ఆపై.. - varshita rape vartalu

ఏపీలోని చిత్తూరు జిల్లాలో చిన్నారి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాక్లెట్ ఆశ చూపించి, ఫొటోలు తీస్తూ... చిన్నారిని ఏమార్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు... నిందితుడు రఫీని అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

chittoor-child
author img

By

Published : Nov 16, 2019, 8:24 PM IST

Updated : Nov 16, 2019, 10:14 PM IST

ఏపీలోని చిన్నారి కేసు

ఏపీలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రఫీని ఛత్తీస్​గఢ్‌​లోని జగదల్​పూర్​లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి, ఫొటోలు తీస్తూ... తన వెంట నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. చిన్నారిపై అత్యాచారం చేసి... ఆపై హతమార్చి కల్యాణ మండపం వెనుక వదిలి వెళ్లినట్లు తేలింది. సీసీ ఫుటేజీ సహా... ఊహా చిత్రాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది..?

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాల్యానికి చెందిన చిన్నారి... తల్లిదండ్రులతో కలిసి ఈనెల 7న చేనేతనగర్‌లోని కల్యాణ మండపంలో జరిగిన పెళ్లికి హాజరైంది. అప్పటి వరకు కల్యాణ మండపంలో సరదాగా ఆడుకున్న చిన్నారి... ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆందోళనకు గురై... చుట్టుపక్కల గాలించారు. మరుసటి రోజు మండపం వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలిసి... అంతా షాకయ్యారు.

నిందితుడి గతమంతా ఇంతే..!

నిందితుడు రఫీ వృత్తి రీత్యా లారీ క్లీనర్. చిన్నతనంలోనే ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి... బాల నేరస్థుడిగా జైలు జీవితం గడిపినట్లు పోలీసులు వెల్లడించారు. రఫీ ప్రవర్తన సరిగా లేదని... భార్య అతడ్ని వదిలేసినట్లు చిత్తూరు ఎస్పీ తెలిపారు.

ఏపీ సీఎం సీరియస్...

చిన్నారి కేసుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని వ్యాఖ్యనించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని త్వరగా పట్టుకోవాలని... కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు... బృందాలుగా ఏర్పడి గాలించారు. చివరకు నిందితుడిని ఛత్తీస్​గఢ్‌​లో అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి...కొన్ని గంటల్లో శుభకార్యం... అంతలోనే విషాదం

Intro:Note: visulas live తీసుకున్నారు. Kit no: 613

చిత్తూరు జిల్లా అంగళ్లు సమీపం లో హత్యకు గురైన చిన్నారి వర్షిత కేసును పోలీసులు చేధించారు. కుర బలకోట మండలం చేనేత నగర్ కు చెందిన బాలిక వర్షితా
ఈ నెల 7 న తల్లి తండ్రులతో కలిసి పెళ్లికి వెళ్ళింది.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన అంగళ్లు గ్రామం లోని మొలక వారి పల్లి కి చెందిన రఫీ(25) చిన్నారి వర్షితకు చాక్లెట్ ఆశ చూపించి ఫోటోలు తీస్తూ తన వెనకే తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడించారు. అనంతరం సమీపంలోని బహిర్భూమికి తీసుకువెళ్ళి చిన్నారి వర్షిత పై అఘాయిత్యానికి పాల్పడినట్టూ వివరించారు. అత్యాచారం చేసి ఆ పై హతమార్చి...కల్యాణ మండపం వెనుక వదిలి వెళ్ళిన ట్టూ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్, ఊహా చిత్రాల సాయం తో నిందితున్ని పట్టుకున్నట్లుు పేర్కొన్నారు. కేసు చేధనలో మదనపల్లె డిఎస్పీ, ముగ్గురు సీఐ లు, ముగ్గురి ఎస్ ఐ లతో ప్రత్యేక బృందాలు పనిచేసినట్లు తెలిపారు.
ఘటన పై సీఎం జగన్ సీరియస్ అవడం తో దర్యాప్తు మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఇవాళ
ఉదయం నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుడు రఫీ వృత్తి రీత్యా లారీ క్లీనర్ గా పని చేస్తున్నట్లు చెప్పారు. రఫీ చిన్నతనంలోనే ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి బాల నేరస్థుడు గా జైలు జీవితం గడి పాడు. అరెస్టు చేసిన రఫీనీ
కోర్టు ముందు హాజరపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. Body:.Conclusion:.
Last Updated : Nov 16, 2019, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.