చింతల్ డివిజన్లో సమస్యల పరిష్కారానికి భాజపాను గెలిపించాలని అభ్యర్థి పత్తి శ్రుతి ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు గ్రేటర్ ఎన్నికల్లో విద్యావంతులకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
డివిజన్ పరిధిలో కొంతమంది ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తీరుస్తానని శ్రుతి హామీ ఇచ్చారు.