కొవిడ్-19 వల్ల పిల్లల చదువును బహిరంగంగా అమ్మకానికి పెట్టి.. వారి తల్లిదండ్రులను ఫీజుల కోసం వేధిస్తున్నారని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. లాక్డౌన్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటూ.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని.. బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ భార్గవి అన్నారు.
ఆన్‌లైన్ తరగతులు ఆర్థం గాక, వచ్చిన సందేశాల్ని నివృత్తి చేసుకోలేక పిల్లలు కుంగిపోతున్నారన్నారు. పాఠశాలలు బంద్ కావడం వల్ల బడుగు వర్గాలకు చెందిన పిల్లలకు కనీసం ఒక్కపూట కూడా పౌష్టికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసిన ఇచ్చినట్లు ఆమె తెలిపారు.