Dr pathipaka mohan బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు ఎంపిక అయ్యారు. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన 'బాలలతాత బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.
డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రియ శిష్యుల్లో ఒకరైన డాక్టర్ పత్తిపాక మోహన్... బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం మన కవులు, బాలలతాత బాపూజీ, జో.. అచ్యుతానంద జోజో ముకుంద..., చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ వంటి అనేక రచనలు బాలల కోసం అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సహాయ సంపాదకులుగా వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అనువాదం చేశారు.
ఇవీ చదవండి: