ETV Bharat / state

టీవర్క్స్‌ వేదికగా మేకర్స్‌ ఫెయిర్‌ ఈవెంట్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో పిల్లల నూతనావిష్కరణలు

Children innovative devices at maker faire Exhibition : సృజన, విజ్ఞానం, సాంకేతికతల వంటి అంశాల్లో ఆసక్తి ఉన్న ఔత్సాహికులంతా ఒక్క చోటుకి చేరారు. ఇందుకు రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీవర్క్స్‌ వేదికైంది. మేకర్స్‌ ఫెయిర్‌ పేరుతో 2 రోజులు జరిగిన ఈవెంట్‌లో యువత రూపొందించిన ఆవిష్కరణలు పలువురిని ఆలోచింపజేశాయి. విజ్ఞాన, సాంకేతికత, ఇంజినీరింగ్‌, కళలు, హస్త కళల ఉత్పత్తుల స్టాళ్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి, ఆ విశేషాలేంటో మనమూ చూసేద్దాం పదండి.

Hyderabad Maker Fair
Children Innovative Devices at Maker Faire Exhibition in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2023, 12:54 PM IST

Children Innovative Devices at Maker Faire Exhibition in Hyderabad టీవర్క్స్‌ వేదికగా మేకర్స్‌ ఫెయిర్‌ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​లో పిల్లల నూతనావిష్కరణలు

Children Innovative Devices at Maker Faire Exhibition in Hyderabad : చూస్తున్నారుగా! ఆవిష్కరణలు ఎలా ఉన్నాయో. ఒక్కో స్టాల్లో ఒక్కో వినూత్న రూపకల్పన ఆకట్టుకుంటుంది కదూ! దేశంలోని వివిధ రంగాలలో ఆసక్తులు గల ఔత్సాహికులంతా ఇలా ఒక్క చోట చేరారు. ప్రతిభ, నైపుణ్యాలతో రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ అందరిని ఆలోచింపజేస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని చూసేందుకు విద్యార్థులు, యువత భారీగా వచ్చారు.

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ వర్క్స్ ఎప్పుడు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చూడుతుంది. గతేడాదిలాగే ఈ సారి కూడా మేకర్ ఫెయిర్ పేరిట యువతను ఆకట్టుకునే సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌ ద్వారా ఇన్నోవేటర్స్, మేకర్స్, అంకుర సంస్థలు, కార్పొరేటర్స్, విద్యార్థులు ఇలా అందరిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు నిర్వాహకులు.

18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..

హస్తకళలు, త్రీడీ పెయింటింగ్ ప్రదర్శనకు వేదికైంది టీ వర్క్స్‌లోని మేకర్ ఫెయిర్. చిత్రకళ, మట్టి పాత్రల తయారీ, త్రీడీ పెయింటింగ్, వెల్డింగ్ తదితర కళాకృతులు రూపొందించి ప్రతిభను ప్రదర్శించారు ఆవిష్కర్తలు. అంతేకాక సృజన, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఇంజనీరింగ్, కళలు, హస్తకళల ఉత్పత్తులను ప్రదర్శించారు. నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఈ స్టాల్స్‌ని ఏర్పాటు చేశారు.

Hyderabad Maker Fair : మేకర్ ఫెయిర్ ప్రదర్శనలో సృజనాత్మకమైన కళాకృతులతోపాటు వాటిని తయారు చేసే యంత్రాలు కొలువుదీరాయి. వివిధ జంతువుల ఆకారాల్లో రోబోలు, విద్యుత్ వాహనాలు, వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు వెల్డింగ్‌తో వివిధ కళాకృతులను రూపొందించారు. ప్రదర్శనలో రోబో రేసు పోటీలు నిర్వహించారు. ఫాంటసీ సినిమాలు, సీరియళ్ల పాత్రల వేషధారణల పోటీలు కోలాహలంగా సాగాయి.

ఏఐ సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్న సంస్థల ప్రతినిధులు ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులకు వాటి ప్రత్యేకతలు తెలియజేశారు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి మరింత ఉజ్వలంగా ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు. రోబోటిక్‌ను రియల్ టైంలో ఏవిధంగా తీసుకురావాలి? తదితర అంశాలపై నిపుణులు సూచనలు సలహాలు ఇచ్చారు. వాయిస్ బేస్‌తో రోబోను ఏవిధంగా కంట్రోల్ చేయవచ్చు అనే అంశంపై మెళకువలు నేర్పించారు.

11 ఏళ్ల వయసులోనే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న హైదరాబాద్ బాలిక - శాస్త్రవేత్తగా ఇస్రో, నాసాలో సేవలందించడమే లక్ష్యం

ఇటీవలి కాలంలో డ్రోన్స్‌ వాడకం భారీగా పెరిగిపోయింది. దాంతో ఉపాధి అవకాశాలు ఈ రంగంలో మెండుగా ఏర్పడుతున్నాయి. అందుకనుగుణంగా డ్రోన్ ఆపరేటింగ్‌ను సిస్టమ్‌ని కూడా నేర్పించారు. సాధారణ ప్రింటింగ్ నుంచి త్రీడీ ప్రింటింగ్ యుగం వచ్చేసింది. దాంతో త్రీడీ ప్రింటింగ్‌కి కావల్సిన మెళకువలు నేర్పించి పిల్లల సృజనాత్మకతకు మెరుగులు దిద్దే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.

Special Story on Medical Student Mahender : డాక్టర్ అయ్యేందుకు స్పీడ్​ బ్రేకర్​గా పేదరికం.. ఎవరైనా సాయం చేస్తే..!

టీ వర్క్స్‌ వేదికగా జరిగిన మేకర్ ఫెయిర్ ప్రదర్శనకు యువత నుంచి మంచి ఆదరణ వచ్చింది. వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్న ఔత్సాహికులంతా ఒక్కచోట చేరి వారి ప్రతిభ, నైపుణ్యాలను పంచుకున్నారు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆసక్తి గల విద్యార్థులకు ప్రేరణ కల్గించినట్లు అవుతుందిని తల్లిదండ్రులు అంటున్నారు. రెండురోజుల ప్రదర్శనకు సుమారు 30వేల మంది వచ్చినట్లు కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు.

Vogue Italia : వోగ్‌ ఇటాలియాలో 'మనోళ్ల బొమ్మ'.. సరదాగా తీసిన ఫొటోకు గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.