ETV Bharat / state

ఆర్టీసీ సమ్మె, కార్మికుల చేరికపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష - latest news of cm meet to officers on the issue of tsrtc workers

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన గడువు ముగియడంతో ఎంతమంది కార్మికులు విధుల్లో చేరారనే వివరాలను ముఖ్యమంత్రికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అందజేశారు. అధికారులతో కేసీఆర్ ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
author img

By

Published : Nov 6, 2019, 4:53 AM IST

Updated : Nov 6, 2019, 7:34 AM IST

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో ఎందరు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది చేరారనే సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​కు అధికారులు అందజేశారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్​లో సీఎంను మంగళవారం రాత్రి కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రైవేటు బస్సుల పర్మిట్లకు విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలనూ ఖరారు చేసినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ముగిసిన డెడ్​లైన్​... తర్వాత ఏం జరగనుందో..?

TG_HYD_09_06_AGRI_MINISTER_VISIT_AV_3181965 reporter : praveen kumar note : feed sent to taza desk ( ) నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరం లో ఏర్పాటు చేసిన పెట్టుబడి దారుల సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయం మరియు విత్తన రంగం లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, విత్తన పరిశ్రమ సామర్థ్యం గురించి మంత్రి వివరించారు. యూరప్ తో వర్తకంలో భారత్ ముఖ్య భాగస్వామి అని.. తెలంగాణ రాష్ట్రం పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు, విత్తన ఉత్పత్తి రంగానికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించవలసిందిగా డచ్ ట్రేడ్ మిషన్ సభ్యులకు ఆహ్వానం పలికారు. తెలంగాణ విత్తన పరిశ్రమ అభివృద్దికి, అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన వేరుశన సాగుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన డచ్ ట్రేడ్ మిషన్.. గత నెల అక్టోబర్ 14 నుంచి 18 వరకు కింగ్ విలియం అలెక్సాండర్ అద్యక్షతన ఆహారం, వ్యవసాయం అంశాలపై 250 మంది డచ్ ట్రేడ్ మిషన్ ప్రతినిధులు భారత్ లో పర్యటించి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపారు. ఈ పర్యటనలో నెదర్లాండ్స్ లోని నక్తంబౌ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద ఉండే, ప్రభుత్వ రంగ స్వయం ప్రతిప్రత్తి సంస్థ అయిన ఉద్యాన పంటల సాగు, నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డ్యామ్ సమీపంలో ఆస్లామీర్ ప్రాంతం లో ఉండే ప్రపంచంలో 128 ఎకరాలలో ఉండే 3వ అతిపెద్ద అతి పెద్ద పూల వేలం భవనం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి బృందం సందర్శించింది.
Last Updated : Nov 6, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.