ETV Bharat / state

ఆదాయం లేదు.. కోతలు తప్పట్లేదు : కేసీఆర్​ - ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు

వివిధ అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడనందున ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఈ నెలలోనూ కోత అమలు చేయాలని నిర్ణయించారు. 12 కిలోల బియ్యం ఆసరా ఫించన్లు కొనసాగించాలన్న ఆయన 1500 ఇచ్చే పథకాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.

chief-minister-kcr-has-made-several-key-decisions-after-a-high-level-review-on-various-issues
ఆదాయం లేదు.. కోతలు తప్పవు: కేసీఆర్​
author img

By

Published : May 28, 2020, 7:03 AM IST

Updated : May 28, 2020, 8:03 AM IST

ఆదాయం లేదు.. కోతలు తప్పట్లేదు : కేసీఆర్​

లాక్‌డౌన్‌ ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, నిబంధనలు సడలించినా రాబడి పెరగలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రానికి ప్రతినెలా రూ.12 వేల కోట్ల రాబడి రావాల్సి ఉండగా మే నెలలో కేవలం రూ.3100 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మే నెల వేతనాల్లో కూడా కోత కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పదవీ విరమణ ఉద్యోగుల పింఛన్లలో 25 శాతం, పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో పది శాతం కోత కొనసాగుతుంది. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని, ఆసరా పింఛన్లను యథావిధిగా అందించాలని సర్కారు నిర్ణయించింది. పేదలకు ఇస్తున్న 12 కిలోల బియ్యాన్ని జూన్‌ నెలలో కూడా అందిస్తారు.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కార్మికులకు పనులు దొరికే అవకాశం ఉన్నందున పేదలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1500 నగదు సాయాన్ని జూన్‌ నెలలో నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జూన్‌ 1 నుంచి 8 వరకు పరిశుభ్రత

రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో జూన్‌ 1 నుంచి 8 వరకు పరిశుభ్రత - పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణతో పాటు, రాబోయే వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని కోరారు. పల్లెల్లో, పట్టణాల్లో జూన్‌ మొదటి వారంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. పురపాలక మంత్రి కేటీ రామారావు, ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, సంచాలకుడు సత్యనారాయణ, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులను సీఎం వివరించారు. మురికి కాలువల శుభ్రత, రోడ్లపై గుంతల పూడ్చివేత, తాగునీటి పైపు లైన్ల లీకేజీల నివారణ, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రేపటిలోగా గ్రామాల్లో విత్తనాలు

నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా ఏ సమూహంలో ఏ పంట వేయాలనే అంశంపై అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.

వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు- ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ‘మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. ఈ వర్షాకాలంలో మక్కలు వద్దని మాత్రమే చెప్పాం. వాటి బదులు కందులు లేదా పత్తి వేయమని కోరాం. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పాం. కాకపోతే మార్కెట్లో డిమాండ్‌ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయమన్నాం. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ సారి మరో 10-15 లక్షలు పెంచమన్నాం. మిగతా పంటల విషయంలో ఎలాంటి మార్పులు సూచించలేదు. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారు. మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలి. రైతులు కూడా ఆలోపుగానే తమ ధాన్యం అమ్ముకోవాలి. 31 తర్వాత కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితులు జూన్‌ 1 నుంచి వర్షాకాలం పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలి’ అని సీఎం సూచించారు.

రీ షెడ్యూలు చేయాలన్నా కేంద్రం వినలేదు

రుణాలను రీ షెడ్యూలు చేయాలని కేంద్రాన్ని కోరినా వినలేదు. ఫలితంగా రుణ వాయిదాలు విధిగా చెల్లించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఏటా అప్పులకు కిస్తీలుగా రూ.37,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచినా, కేంద్రం విధించిన షరతుల వల్ల అదనపు రుణం సమకూర్చుకునే పరిస్థితి లేదు

- కేసీఆర్‌

రాబడి పెరగలేదు...

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా ఆదాయం పెద్దగా రాలేదు. వచ్చిన కొద్దిపాటి రాబడితోనే సర్దుకోవాలి. రాష్ట్రానికి ప్రతినెలా రూ.12 వేల కోట్ల రాబడి రావాల్సి ఉండగా మే నెలలో కేవలం రూ.3100 కోట్లు మాత్రమే వచ్చింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించాలంటే రూ. 3000 కోట్లకు పైగా అవసరం. వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే సర్దుకోవాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

కోతలు తప్పవు..

రాష్ట్రంలోని ఉద్యోగులకు ఈ నెలలో కూడా వేతనాల కోత అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పింఛన్లు యథావిధిగా చెల్లిస్తారు. జూన్‌లోనూ పేదలకు 12 కిలోల బియ్యాన్ని ఇస్తారు. ప్రతి నెలా ఇస్తున్న రూ.1500 నగదు సాయాన్ని మాత్రం నిలిపివేస్తారు.

కర్ఫ్యూ నుంచి బస్సులకు మినహాయింపు

ఆర్టీసీ బస్సులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. గురువారం నుంచి రాత్రి పూట కూడా బస్సులు తిరుగుతాయి. హైదరాబాద్‌లో సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి ఇవ్వలేదు. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతిస్తారు. బస్సు టికెట్‌ ఉంటే కర్ఫ్యూ సమయంలోనూ ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతరం చెప్పరు.

అన్ని దుకాణాలకూ అనుమతి

హైదరాబాద్‌ నగరంలో గురువారం నుంచి మాల్స్‌ మినహా అన్ని రకాల దుకాణాలు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Last Updated : May 28, 2020, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.