ETV Bharat / state

ఆ యువకులు అభాగ్యులకు ఆపద్బాంధవులు - హైదరాబాద్ తాజా వార్తలు

నిలువ నీడ లేక... గడ్డకట్టుకుపోయే చలిలో రోడ్డు పక్కనే నివాసముంటున్న వారికి ఆపన్నహస్తం అందిచారు ఆ యువకులు. తమకు తోచిన సాయం చేసి ఆ అభాగ్యులకు ఉడత సాయం చేశారు. నిరుపేదలను ఆదుకోవడానికి మానవత్వంతో మరికొంత మంది ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

chethana foundation help to poor people in hyderabad
అభాగ్యులకు ఆపద్బాంధవులైన ఆ యువకులు
author img

By

Published : Dec 12, 2020, 8:01 AM IST

Updated : Dec 12, 2020, 8:45 AM IST

రోడ్ల పక్కనే నివాసముండే అభాగ్యుల పట్ల ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు ఆ యువకులు. నిలువ నీడ లేక చలికి వణుకుతూ జీవనం సాగిస్తున్నవారికి తమవంతు సాయం చేసి దాతృత్వం చాటుకున్నారు. గడ్డకట్టుకుపోయే చలిలో రాత్రి పూట రోడ్డు పక్కనే ఉన్న పేదలకు కప్పుకోవడానికి దుప్పట్లు అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చేతన ఫౌండేషన్ సభ్యులు. ఫౌండర్ రవి సాయంతో హైదరాబాద్​లో వివిధ సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కూకట్​పల్లిలోని జేఎన్​టీయూ మొదలుకొని మియాపూర్, శేర్లింగంపల్లి, పటాన్​చెరు తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి దుప్పట్లు అందజేశారు.

రోడ్ల పక్కన నివసించే వారికి అందరూ తోచిన సాయం చేయాలంటూ కోరుతున్నారు. తాము ఎన్ని కార్యక్రమాలు చేసినా వారి ఇబ్బందులను తొలగించలేకపోతున్నామని... అందరూ మానవత్వంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఆ యువకులు అభాగ్యులకు ఆపద్బాంధవులు

ఇదీ చదవండి: ఈ నెల 15 నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు

Last Updated : Dec 12, 2020, 8:45 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.