ETV Bharat / state

Cheruku Sudhakar Join BRS Party : బీఆర్‌ఎస్‌ గూటికి చెరుకు సుధాకర్‌.. నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామన్న కేటీఆర్ - Harish Rao Reaction on Cheruku Sudhakar Join BRS

Cheruku Sudhakar Join BRS Party at Telangana Bhavan : మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో చెరుకు సుధాకర్‌ బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలంగాణ భవన్​లో ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

BRS Latest Joinings
Cheruku Sudhakar Join BRS Party at Telangana Bhavan
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 6:11 PM IST

Updated : Oct 21, 2023, 7:23 PM IST

Cheruku Sudhakar Join BRS Party at Telangana Bhavan : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాన పార్టీల్లో నాయకుల చేరికలు అధికమవుతున్నాయి. పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌... మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో కండువా కప్పుకున్నారు.

KTR Reaction on Cheruku Sudhakar Join BRS : చెరుకు సుధాకర్‌ను సంతోషంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని మంత్రి కేటీఆర్‌(KTR) అన్నారు. ఉద్యమ సమయంలో ఆయన జైలు జీవితాన్ని గడిపారని తెలియజేశారు. నల్గొండ ప్రజలకు చైతన్యం ఎక్కువని.. రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. నల్గొండలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

TDP leader Ravula Chandrasekhar Reddy joining BRS : బీఆర్​ఎస్​లో​ చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

Harish Rao Reaction on Cheruku Sudhakar Join BRS : చెరుకు సుధాకర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమవాదిగా ఆయనను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్‌ తీవ్రంగా శ్రమించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కిషన్‌రెడ్డి(Kishan Reddy) రాజీనామా చేయలేదని.. వెన్నుచూపి పారిపోయారని ఆరోపించారు. ఉద్యమకారులపై ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తుపాకి ఎక్కుపెట్టారని పేర్కొన్నారు. రేవంత్‌ సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్‌ నేతలే ఆరోపిస్తున్నారని తెలిపారు.

KTR Fires on Congress Party : 'డబ్బులు పంచనని ప్రమాణం చేయాలంటున్న రేవంత్‌ తీరు.. హంతకుడే సంతాపం తెలిపినట్లుంది'

Harish Rao Comments on Congress : సోనియాను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని హరీశ్‌రావు(Harish Rao) ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని హస్తం నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ అంటేనే మాటలు, ముఠాలు, మంటలని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ చేతిలో పెడితే ఆగం అవుతుందని మండిపడ్డారు.

BRS Party Latest Joinings : కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఆచరిస్తోంది... దేశం అనుసరిస్తోందని అన్నారు. బీఆర్ఎస్‌ మేనిఫెస్టో(BRS MANIFESTO)ను కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ మళ్లీ గెలవాలి... తెలంగాణ అభివృద్ధి పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. పనితనం తప్ప.. పగతనం లేని నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు. కేసీఆర్‌ హయాంలో కరవు, మత కలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని తెలిపారు. నేడు తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 11 రోజులు అన్నం ముట్టకుండా కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

"తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా శ్రమించాను. నాలో ఆలోచనా విధానానికి తెలంగాణ భవన్‌ పదును పెట్టింది. తెలంగాణ గుండె చప్పుడు టీఆర్‌ఎస్‌ అని ఫ్లకార్డులు ప్రదర్శించాను . భవిష్యత్తులో ప్రజలకు బీఆర్‌ఎస్‌ ఆయువుపట్టు కావాలి"- చెరుకు సుధాకర్‌, బీఆర్ఎస్‌ నాయకుడు

Cheruku Sudhakar Join BRS Party : బీఆర్‌ఎస్‌ గూటికి చెరుకు సుధాకర్‌

KTR in Thanksgiving Meeting of Disabled People : తెలంగాణలోనే అధిక పింఛన్​లు.. దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్

KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్​ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'

Last Updated : Oct 21, 2023, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.