హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అగ్నిమాపకశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వెదజల్లుతున్నారు. ఇందులో భాగంగా మలక్పేట గంజ్గా పిలిచే మహబూబ్ మాన్షన్ మార్కెట్లో 2500 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో చాదర్ఘాట్ ఇన్స్పె క్టర్ నాగరాజు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాధా పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు