చార్మినార్ జోనల్ కమిషనర్ నామ సామ్రాట్ అశోక్.. జోనల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రానున్న వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నాలాలు, డ్రైనేజీ మ్యాన్‌హోళ్లలో పూడికతీత చేపడతామని తెలిపారు. పంజేషా, మీరాలం మండి, పురాని హవేలి, బాబానగర్, చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్, రాజేంద్రనగర్ సర్కిల్లోని శాస్త్రిపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్, పార్కులు, బస్తీ దవాఖానాలను పరిశీలించారు.
ప్రతిరోజు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వ్సాక్సిన్ పంపిణి చేయనున్నామని తెలిపారు. మలక్‌పేట్ ముంతాజ్ కాలేజ్, గౌలిపురా మిత్ర క్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రెయిన్‌బజార్ ఎస్ఆర్టీ కాలనీ ప్లే గ్రౌండ్, చాంద్రాయణగుట్ట సుహానా ఫంక్షన్ హాల్, చార్మినార్ సర్దార్ మహల్ సనా గార్డెన్, బహదూర్ పుర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, శివరాంపల్లిలోని ఎస్ఎన్సీ కాన్వేషన్ హాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. కమిషనర్‌తో పాటు పత్తర్ గట్టి, ఉప్పుగూడ కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్వోలు ఉన్నారు.
ఇదీ చదవండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'