ETV Bharat / state

నిరుపేదలకు అండగా నిలుస్తోన్న స్వచ్ఛంద సంస్థలు - భోజనం ప్యాకెట్ల పంపిణీ

లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు.. మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో, ఫుట్​పాత్​పై జీవనం సాగిస్తోన్న వారికి పదం చంద్​ అనే స్వచ్ఛంద సంస్థ భోజనం ప్యాకెట్లను పంపిణీ చేసి ఆదుకుంటోంది.

food distribution
food distribution
author img

By

Published : May 23, 2021, 3:20 PM IST

ఆకలితో అలమటిస్తోన్న నిరుపేదలకు.. పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. లాక్​డౌన్​లో ఉపాధి లేక ఇబ్బందులు పడుతోన్న పేదలను ఆదుకుంటున్నాయి. నగరంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు, ఫూట్​పాత్​లపై జీవనం సాగిస్తోన్న వారికి.. పదం చంద్ అనే స్వచ్ఛంద సంస్థ భోజనం ప్యాకెట్లను అందజేసి మానవత్వాన్ని చాటుకుంటోంది.

నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో.. 200 మంది రోగులు వారి సహాయకులకు, నాంపల్లిలో ఫుట్​పాత్​లపై ఉంటోన్న వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు సంస్థ సభ్యులు. లాక్​డౌన్ పూర్తయ్యే వరకు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: కేంద్రం వల్లే వ్యాక్సినేషన్​ జాప్యం : మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.