ETV Bharat / state

''భీష్మ' చిత్ర టైటిల్​ మార్చండి.. లేదంటే అడ్డుకుంటాం' - నితిన్​ భీష్మ సినిమా తాజా వార్తలు

విడుదలకు సిద్ధమవుతున్న హీరో నితిన్​ తాజా చిత్రం భీష్మ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర టైటిల్​ను మార్చాలని.. లేనిపక్షంలో సినిమాను అడ్డుకుంటామంటూ గంగపుత్ర చైతన్య సమితి హెచ్చరించింది.

change bheeshma title otherwise we  Obstruct
''భీష్మ' చిత్ర టైటిల్​ మార్చండి.. లేదంటే అడ్డుకుంటాం'
author img

By

Published : Feb 19, 2020, 3:46 PM IST

Updated : Feb 21, 2020, 11:43 PM IST

ప్రముఖ కథానాయకుడు నితిన్​ హీరోగా నటిస్తున్న భీష్మ చిత్ర టైటిల్‌తో పాటు చిత్రంలో హీరో పేరూ మార్చాలని.. లేనిపక్షంలో సినిమాను అడ్డుకుంటామని గంగపుత్ర చైతన్య సమితి హెచ్చరించింది. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పేరు మార్చాలంటూ.. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ చిత్ర టైటిల్​ గంగపుత్ర కులపితామహుడైన భీష్మ వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా ఉందని ఆ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం పేరు, హీరో పాత్ర పేరు మార్చకుండా సినిమా విడుదల చేస్తే.. అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.

తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యపాలనకు, వైవాహిక జీవితానికి దూరమై.. ఆజన్మ బ్రహ్మచారిగా చరిత్రలో నిలిచిపోయిన భీష్మను కించపర్చే విధంగా సినిమా తీయడం చిత్ర బృందానికి మంచిది కాదని హితవు పలికారు.

''భీష్మ' చిత్ర టైటిల్​ మార్చండి.. లేదంటే అడ్డుకుంటాం'

ఇదీ చూడండి:'క్రష్​లా.. అబ్బో చాలా మంది ఉన్నారు'

Last Updated : Feb 21, 2020, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.