CHANDRABABU FIRES ON AP MINISTERS: పరిపాలన చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రితో మంత్రులకు ఫ్రస్టేషన్ వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తనకేమి ఫ్రస్టేషన్ లేదన్న ఆయన.. మంత్రులకే నిద్రలేకుండా చేస్తానని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా రూ.2వేల నోట్లు కనపడట్లేదని అవన్నీఏపీలోని తాడేపల్లి ప్యాలెస్లో దాచిపెట్టడం, దిల్లీ తరలించటం జరుగుతోందని ఆరోపించారు. అధికారుల్ని కోర్టు బోన్లలో నిలపెడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు మంత్రులు సమాధానం చెప్తారా అని నిలదీశారు.
ఇవీ చదవండి: