చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి ఆరోగ్యం మెరుగుపడింది. గతంలో దాడి నేపథ్యంలో అనారోగ్యానికి గురైన ఆయన లండన్‌లో 45 రోజులపాటు చికిత్స పొందారు. ఇవాళ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున అక్బరుద్దీన్ రాకతో అభిమానులు, కార్యకర్తలతో శంషాబాద్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అక్బర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఇదీ చూడండి: పార్టీ కష్టాల్లో ఉంటే హరీశ్ ఊపిరిపోశారు: కేసీఆర్