ETV Bharat / state

విజయగాథకు చిహ్నం.. హైదరాబాద్ హైటెక్ సిటీ: చంద్రబాబు - 21 ఏళ్ల క్రితం

హైదరాబాద్​లో ఐటీ విప్లవానికి బీజం వేసిన హైటెక్ సిటీని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్నారు. సరిగ్గా 21 ఏళ్ల కిందట ఇదే రోజున హైదరాబాద్​లో సైబర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.

హైటెక్ సిటీకు 21 ఏళ్లు
author img

By

Published : Sep 23, 2019, 11:10 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో.. 21 ఏళ్ల క్రితం తన ప్రభుత్వ హయాంలో... రాజధాని హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణ జ్ఞాపకాలను తెదేపా అధినేత చంద్రబాబు నెమరువేసుకున్నారు. నాడు వేసిన బీజం.. నేడు నగరానికే తలమానికంగా మారడమే కాక.. రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. భారతదేశంలో ఐటీ సూపర్‌ పవర్‌ అనే విజయగాథకు ఈ సైబర్‌ టవర్‌ ఒక ఉదాహరణగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సైబర్‌ టవర్స్‌ శంకుస్థాపనకు సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

హైటెక్ సిటీకు 21 ఏళ్లు

చంద్రబాబును కలిసిన విద్యార్థులు

హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని సైబర్ టవర్స్ నిర్మాణం జరిగి నేటికి 20 ఏళ్లు అయిన సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు చంద్రబాబును కలిసి... అభినందనలు తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి తాను చేసిన కృషిని.. విద్యార్థులతో చంద్రబాబు పంచుకున్నారు. అదే మాదిరిగా ఏపీలో చేయాలనుకుంటే రివర్స్ చేశారని.. గత ఐదేళ్లలో వచ్చిన అనేక సంస్థలు ఇప్పుడు వెనక్కిపోతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్.. అప్రతిష్ఠ పాలు కావడం ఆవేదన కలిగిస్తోందని తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.