Chandrababu fires on YCP Government : రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ప్రతిష్ఠను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండింటినీ చంపేసి వైసీపీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటోందని మండిపడ్డారు. పరిశ్రమలు ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, ఏపీ మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని విమర్శించారు. భూములను వెనక్కి తీసుకోవడం, దాడులతో వేధించడం, అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో ఏపీ ప్రతిష్ఠ దిగజారుతోందని విమర్శించారు.
-
In a span of 4 decades, Amararaja has become the pride of the State by creating direct and indirect employment to over 1 lakh families in Rayalaseema region.(1/5) pic.twitter.com/pWZrxXfHJM
— N Chandrababu Naidu (@ncbn) December 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">In a span of 4 decades, Amararaja has become the pride of the State by creating direct and indirect employment to over 1 lakh families in Rayalaseema region.(1/5) pic.twitter.com/pWZrxXfHJM
— N Chandrababu Naidu (@ncbn) December 3, 2022In a span of 4 decades, Amararaja has become the pride of the State by creating direct and indirect employment to over 1 lakh families in Rayalaseema region.(1/5) pic.twitter.com/pWZrxXfHJM
— N Chandrababu Naidu (@ncbn) December 3, 2022
ప్రజలిచ్చిన అధికారానికి ద్రోహం చేసి.. జగన్మోహన్ రెడ్డి క్షమించరాని తప్పులు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని దుయ్యబట్టారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలం పాటు దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా అమర్‌రాజా సంస్థ నిలిచిందని తెలిపారు. ఏపీలో ఉన్న పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.