Chandrababu Comments on Election Contest in Telangana 2023 : రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తెలిపారు. భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయిందన్నారు. ఎవరు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో ఒంటరిగానే పోటీకి వెళ్తాం. బీడేపీతో కలిసి వెళ్లడానికి సమయం మించిపోయింది. ఎవరు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
Chandrababu Chitchat with Natioanl Media : ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అతి పెద్ద సమస్య జగనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ మోహన్‌రెడ్డి ఓడిపోతేనే ఏపీ బాగుపడుతుందని పేర్కొన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. 'రాజకీయాల్లో జగన్ అనుభవం ఎంత..? బచ్చా..' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే టీడీపీలో చేరేందుకు వైసీపీ నుంచి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. తాము గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ విలీనమైపోతుందని, వైసీపీ కాస్తా.. టీడీపీగా మారుతుందని స్పష్టం చేశారు.
"NTR చేసిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తు చేస్తే BRS ఉలిక్కిపడుతోంది"
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అతి పెద్ద సమస్య జగనే. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది. విభజన గాయాల కంటే దారుణంగా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు. టీడీపీలో చేరేందుకు వైసీపీ నుంచి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మేం గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ విలీనమైపోతుంది. టీడీపీ ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ. జాతీయ రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రత్యేక హోదా అంశంపైనే కేంద్రంతో విభేదించాం. మిగతా విషయాల్లో కేంద్రంతో భేదాభిప్రాయాలు లేవు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పా. - చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక అనుబంధం..: మరోవైపు.. టీడీపీ ఎప్పుడూ జాతీయభావంతో ఉండే పార్టీ అని.. జాతీయ రాజకీయాల్లో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపైనే కేంద్రంతో విభేదించామన్న చంద్రబాబు.. మిగతా విషయాల్లో కేంద్రంతో భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానన్నారు.
తెలంగాణ తెదేపాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలి: చంద్రబాబు
Harikrishna Death Anniversary at NTR Trust Bhavan : ఇదిలా ఉండగా.. నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ వృద్ధిలో కీలక పాత్ర పోషించటంతో పాటు.. చైతన్య రథ సారథిగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సూర్య దేవర లత, పార్టీ నేతలు సంధ్యపోగు రాజశేఖర్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ సహా పలువురు నేతలు హరికృష్ణకు నివాళులర్పించారు.
Chandrababu Naidu harsh comments on Jagan జగన్ పోలవరంపై క్షమించరాని తప్పు చేశాడు! : చంద్రబాబు
21వ శతకం మనదే.. వందేళ్ల పంద్రాగస్టు నాటికి భారత్ సూపర్ పవర్!: చంద్రబాబు