chandra babu on mp gorantla madhav issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. "నీచపు పనిచేసి ఎవ్వరూ బహిరంగంగా తిరగలేరు.. కానీ సిగ్గులేని వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారు" అని మండిపడ్డారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే.. చూస్తూ ఉండాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నవారు.. తప్పు చేసిన వారిని మందలించి, దండిస్తే, మిగిలిన వాళ్లకు భయం ఉంటుందన్న చంద్రబాబు.. జగన్ రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు భూకబ్జాలు వంటివి పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రౌడీలే పోలీసుల్ని చంపే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో తయారైందని.. సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. ఈ అన్యాయాలను, దారుణాలను ప్రశ్నిస్తే.. సాక్షిలో గుమస్తాగా పనిచేసే వ్యక్తి కూడా తన గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఎన్నికలోనూ గెలవలేని ఆ గుమస్తా.. 7 ఎన్నికల్లో గెలిచిన తనగురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: