ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో నేడు పోడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసేందుకు వీలుందని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..