బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను మరో 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద రేపు సాయంత్రానికి ఇది తీరం దాటనుందని తెలిపింది. పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉన్నందున.. ఒడిశా, బంగాల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
యాస్ ప్రభావంతో ఏపీలో నేడు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. రేపు కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను హెచ్చరికలతో ఇప్పటికే కీలకప్రాంతాల్లో సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను యంత్రాంగం మోహరించింది.
ఇదీ చదవండి : 'యాస్'ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సన్నద్ధం