హైదరాబాద్లోని బాల్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వినాయక నగర్లో గొలుసు చోరీ జరిగింది. రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా... గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మీ మెడలోంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష్మీ మెడలోంచి గొలుసు లాక్కెళ్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమైనట్లు ఎస్ఐ రవి తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: 'ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది'