రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఫంగస్‌కు ఉపయోగపడే మందులు అందుబాటులో ఉంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. అదే విధంగా బ్లాక్ ఫంగస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ సౌకర్యాలు కల్పించాలని చాడ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తమతమ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకునేందుకు టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చకపోవడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చాడ వెంకట్ రెడ్డి వివరించారు. తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని… ఈ క్రమంలో పేద, మధ్య తరగతి రోగులు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి దాహానికి గురవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య శ్రీలో కరోనాకు వైద్యం అందించాలని సూచించారు.
ఇదీ చూడండి: Rains: రాగల మూడు రోజులు వర్షాలు!