కొత్తగా మారిన విధానంలో జీఎస్టీ రిటర్న్లు దాఖలు చేయడంలో వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులు, సాంకేతిపరంగా వస్తోన్న అనుమానాలు వంటి అంశాలపై కేంద్ర జీఎస్టీ అధికారుల అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది వచ్చే నెల 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
కేంద్ర జీఎస్టీ చీఫ్ కమిషనర్ వాసా శేషగిరిరావు నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాల్లో వివిధ వర్గాలకు చెందిన వ్యాపారస్తులు, వాణిజ్య, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, కన్సల్టెంట్లు, ఆడిటర్లు పాల్గొనేట్లు ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జీఎస్టీకి చెంది కొత్త రిటర్న్ విధానం ఏలా ఉంటుంది.. వెబ్సైట్లో ఏలా అప్లోడ్ చేయాలనే అంశాలపై వివరిస్తారని కేంద్ర జీఎస్టీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కేసీఆర్ ఆతిథ్యానికి ట్రంప్ ఫిదా