సెంచరీకి అతి చేరువలో ఉన్న ఓ బామ్మ కరోనా మహమ్మారిని జయించారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు కరోనా నిర్ధరణ కావడంతో చికిత్స తీసుకొని వైరస్ నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ మదీనగూడలో నివాసముండే సీతారత్నం(99) 5 రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది పూర్తిగా కోలుకొని శుక్రవారం డిశ్చార్జి అయ్యారు.
ఈ వయసులో సీతారత్నం మహమ్మారి నుంచి కోలుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనోనిబ్బరం ఉంటే ఎంతటి ఆపదనైనా ఎదుర్కోవచ్చని ఈ సూపర్ బామ్మ నిరూపించారు. అందరకీ అభివాదం తెలుపుతూ ఉత్సాహంగా ఇంటికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: అచ్చంపేటలో అసైన్డ్ భూమి ఉన్నట్లు విచారణలో తేలింది: కలెక్టర్