ETV Bharat / state

'యాసంగిలో కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తాం' - ts news

Piyush Goyal on Paddy Procurement: రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ స్పష్టం చేశారు. యాసంగిలో కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రప్రభుత్వమే సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

'యాసంగిలో కచ్చితంగా తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేస్తాం'

author img

By

Published : Mar 21, 2022, 3:56 PM IST

Updated : Mar 21, 2022, 6:47 PM IST

Piyush Goyal on Paddy Procurement: యాసంగిలో కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రప్రభుత్వమే సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని.. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో తనను కలిసిన బృందానికి కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని తెరాస సర్కారు చెబుతోదంటూ పీయూష్‌ గోయల్‌ దృష్టికి భాజపా నేతలు తీసుకెళ్లారు.

ఆ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి.. అసలు రా రైస్ కొనమని ఎవరు చెప్పారని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బియ్యం తీసుకుంటున్నప్పుడు.. తెలంగాణలో ఎందుకు ఆపుతామని ప్రశ్నించారు. పక్కాగా రా రైస్ కొనుగోలు చేస్తామని చెప్పారు. గతంలో ఇస్తానన్న బియ్యాన్ని ఇంతవరకు తెలంగాణ ఇవ్వనేలేదన్న ఆయన.. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందన్నారు.

ఫసల్ బీమా అమలు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గోయల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతుల పరిహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 21, 2022, 6:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.