ETV Bharat / state

Kishan reddy: వ్యాక్సినేషన్​ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. అంబర్​పేట మున్సిపల్ గ్రౌండ్​లోని వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వ్యాక్సినేషన్​ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... దేశంలో ఉన్న 138 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్​ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

kishan reddy
Kishan reddy: వ్యాక్సినేషన్​ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు
author img

By

Published : Jun 1, 2021, 3:10 PM IST

హైదరాబాద్​ అంబర్​పేట మున్సిపల్ గ్రౌండ్​లోని వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయడానికి భారత్​లో తయారైన వ్యాక్సిన్​లతో పాటు రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్​లను కూడా జూన్ మొదటివారంలో కల్లా అందుబాటులోకి తీసుకువచ్చి వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 22 కోట్ల మందికి వ్యాక్సిన్ పూర్తి చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందికి వ్యాక్సిన్లను అందించిన దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారతదేశం మూడో స్థానంలో ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 80 లక్షల డోసుల వ్యాక్సిన్​లను కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు దాదాపు 85 శాతం వరకూ ఉచితంగానే అందించడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతులు కోరుతూ గ్లోబల్ టెండర్లు పిలిచాయని... ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. రాష్ట్ర సర్కారు సూపర్​స్ప్రెడర్లకు వ్యాక్సిన్​ అందిస్తోందని పేర్కొన్నారు. అందులో వాటర్​ బోర్డుకు సంబంధించిన మరికొంత మందిని చేర్చాల్సిన అవసరముందని... ఈ విషయమై సీఎస్​తో మాట్లాడతానన్నారు.

వ్యాక్సినేషన్​ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... దేశంలో ఉన్న 138 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్​ అందిస్తాం. అప్పటివరకు ప్రజలు కొంత జాగ్రత్త వహించాలి. -కిషన్​రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఇదీ చదవండి: CORONA: ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.