ETV Bharat / state

నేటి నుంచి కొవిడ్ వ్యాక్సిన్ పబ్లిసిటీ వాహనాలు ప్రారంభం

కరోనా వ్యాక్సిన్ పబ్లిసిటీ వాహనాలను ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి 29 వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ, క‌రోనా టీకాల‌పై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించనున్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ పబ్లిసిటీ వాహనాలను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

author img

By

Published : Jan 23, 2021, 5:16 AM IST

కొవిడ్ వ్యాక్సిన్ పబ్లిసిటీ వాహనాలను ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్ వద్ద కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం, రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణ‌లో ఎంపిక చేసిన 8 జిల్లాలు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్-మ‌ల్కాజిగిరి, సంగారెడ్డి, సిద్దిపేట‌, నిజామాబాద్‌, వరంగ‌ల్ అర్బ‌న్‌, క‌రీంన‌గ‌ర్​లలో ఈరోజు నుంచి 29 వ‌ర‌కు మొబైల్ వ్యాన్ల ద్వారా క‌రోనా వ్యాప్తి నివార‌ణ, క‌రోనా టీకాల‌పై ప్రజలకు అవ‌గాహ‌న కల్పించనున్నారు. పబ్లిసిటీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ తీరుతో అగ్రవర్ణాల్లోని పేదలు నష్టపోయారు: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.