కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రైతుల కోసం ప్రవేశపెట్టిన 16 అంశాల కార్యాచరణ అమలుకోసం అనేక చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్లో కందులు, పత్తి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కందులు పండించే అన్నదాతలు సగటున రూ.50 వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు.
పత్తి రైతుల కోసం కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీటి ఎద్దడి ఉన్న 100 జిల్లాలను గుర్తించి సమగ్ర కార్యచరణకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఉత్పత్తుల రవాణాకు కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టామన్నారు. కిసాన్ ఛానల్ ద్వారా కర్షకులకు వ్యవసాయ అభివృద్ధికి కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్