కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కిషన్ రెడ్డి బుధవారం గండెర్బల్ జిల్లాను సందర్శించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి... కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షలు నిర్వహించారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌కు చెందిన ప్రజలు, వివిధ ప్రతినిధుల బృందాలతో చర్చలు జరిపారు.
ఈ సందర్శనపై మంత్రి స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి స్థానికులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో కలసి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ఇవీ చూడండి: కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు