దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్వతహాగా ఉపయోగించే వంటకాలకు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. రాగి సంకటి, జొన్నరొట్టె వంటి వంటకాలు... సహజంగా రోగ నిరోధకశక్తిని పెంచుతాయన్నారు.
స్థానికంగా లభించే ధాన్యాల్లో అనేక పోషక విలువలు ఉంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వీకులు తీసుకున్న ఆహారం.. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదని కిషన్ వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకునేవిధంగా... ప్రజలను చైతన్యపరిచేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క