ఉత్తరప్రదేశ్లో బాలికపై జరిగిన దారుణకాండకు కారుకులైన వారిన కఠినంగా శిక్షపడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిలకలగూడలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.
అనంతరం సీతాఫల్మండిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహార కిట్లను ఉచితంగా అందజేశారు. అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పోషకాహార కిట్లను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశంలో సరైన పోషకాహారం లేక ఎంతోమంది పేద విద్యార్థులు అనేక సంవత్సరాలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో ముందుందని అన్నారు. మోదీ ఆడపిల్లలను చదివే విధంగా ప్రోత్సాహాన్ని అందచేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేస్తుండడం సంతోషకరమని చెప్పారు. కరోనా సమయంలో వారిని వర్గాల వారు ప్రతి ఒక్కరు నష్టపోయారని.. దేశం కూడా ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు.
పసిపిల్లలకు పేద విద్యార్థులను ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో వారిని ఆదుకోని పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించేందుకు కృషి చేస్తుందని వివరించారు.
ఇవీచూడండి: ఏపీ నోరు మూయించేలా సమాధానం చెబుతాం: కేసీఆర్