Shaikpet flyover opening: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగుతోందని.. ఏడున్నరేళ్లలో భారీగా జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్‌రోడ్ తెలంగాణకు మరో మణిహారం కానుందని.. ఆ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లో సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం- ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం చేపట్టిన అత్యంత పొడవైన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
'హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. రీజినల్ రింగ్‌రోడ్డును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ పూర్తయితే తెలంగాణ ప్రగతికి దోహదపడుతుంది.'
-కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
ఆ నిధులు వినియోగించాలి
Union Minister Kishan reddy: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కొన్ని జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్నాయని... మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో స్కైవేల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. స్వదేశీ దర్శన్ కింద కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని కిషన్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: Shaikpet Flyover Opening: కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: కేటీఆర్