ETV Bharat / state

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కిషన్​ రెడ్డి

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో జరిగిన భాజపా జన్ సంవాద్ సభలో పాల్గొన్నారు.

author img

By

Published : Jul 4, 2020, 8:14 PM IST

central minister kishan reddy fire on telangana state government in hyderabad
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: కిషన్​ రెడ్డి

కేంద్రంపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. కొవిడ్ విషయంలో హైదరాబాద్​ ప్రజలను గాలికొదిలేశారని విమర్శించారు. తెలంగాణకు 6లక్షల మాస్క్‌లు, 2 లక్షల పీపీఈ కిట్లు, మందులు ఇచ్చామని చెప్పారు. గ్రామ పంచాయతీలు, ఉద్యోగులు, విపత్తు నిర్వహణకు నిధులు మంజూరు చేశామన్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో జరిగిన భాజపా జన్ సంవాద్ సభలో ఆయన పాల్గొన్నారు.

కరోనాతో రాజధాని హైదరాబాద్‌ ఎప్పుడు పేలుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయి ధారావి వంటి ప్రాంతాల్లో కరోనా విజృభిస్తోందని.. మురికివాడల్లో కరోనాను జయించేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సభకు భాజాపా రాష్ట్ర అధ్యుక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచందర్​ రావు హాజరయ్యారు.

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.