దేశంలో తయారైన కరోనా టీకా కొవాక్సిన్‌కు అంతర్జాతీయ గుర్తింపు రావడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మనకు మౌలిక వసతులు లేకున్నా.. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ప్రపంచంలోనే ఉత్తమమైన వాక్సిన్‌ను మన తయారు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పర్యాటక రంగ అభివృద్ధికి, వాక్సిన్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
కరోనాపై పూర్తిస్థాయిలో మనం విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇప్పటి వరకు 107 కోట్ల వాక్సిన్ ఇచ్చామని.... జనవరి, ఫిబ్రవరి నాటికి 90 శాతం వాక్సినేషన్ పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
త్వరలోనే పిల్లలకు టీకా
త్వరలోనే 12 నుంచి 18 ఏళ్ల బాల, బాలికలకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని... ఇందుకోసం పెద్ద ఎత్తున వాక్సిన్ తయారు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను మరల పుంజుకోవాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసారిగా వాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ కోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఫార్మా కంపెనీలు చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి కొనియాడారు.
హోటళ్ల రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది
కరోనా కారణంగా గత రెండేళ్లుగా హోటల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తిరిగి ఇప్పుడిప్పుడే పుంజుకుటోందని తెలిపారు. ప్రజల జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయని.. రోజుకో విభిన్న రుచులను కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన డెక్కన్ కిచెన్ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు.
పర్యాటక రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకరాలేదని తెలిపారు. ఇక ముందు త్వరలోనే పూర్తి స్థాయిలో అన్ని పర్యాటక ప్రాంతాలను తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. మంచి రుచులతో పాటు నాణ్యమైన ఆహారం అందించినప్పుడే వినియోగదారుల అభిమానం పొందగలమన్నారు. ఎన్ని రెస్టారెంట్లు ప్రారంభిస్తున్నామనేది ముఖ్యం కాదని... ఎంత నాణ్యమైన ఆహారం అందిస్తున్నామనేదే ప్రధానమని కిషన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీ నటి దివ్య వాణి, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: