ETV Bharat / state

రాష్ట్రంలో ఐసీఆర్​ఎం పరీక్షలకు అనూహ్య స్పందన - రాష్ట్రంలో ఐసీఆర్​ఎం పరీక్షల తాజా వార్తలు

రాష్ట్రంలో నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన సీరమ్ పరీక్షలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్టు సర్వే కో ఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మయ్య స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200శాంపపిళ్లు సేకరించాల్సి ఉండగా ఒక్కరోజులేనే 580 మంది నుంచి నమూనాలు సేకరించినట్టు తెలిపారు. ఈ నెల 25లోపు కేంద్రానికి ఆయా నమూనాలకు సంబంధించిన నివేదికలు అందించనున్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో కొవిడ్​కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ సహా వివిధ అంశాలను తెలుసుకోనున్నారు.

రాష్ట్రంలో ఐసీఆర్​ఎం పరీక్షలకు అనూహ్య స్పందన

author img

By

Published : May 16, 2020, 3:45 PM IST

రాష్ట్రంలో శుక్రవారం నుంచి సీరమ్ సర్వే ప్రారంభమైంది. ఐసీఎంఆర్ ఎంపిక చేసిన మూడు జిల్లాల్లో ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ఈ సర్వేని చేపట్టారు. ఒక్కోజిల్లా నుంచి 400 నమూనాల చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 1200 మంది నుంచి సేకరించాల్సి ఉంది. ఇక నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సర్వే ప్రారంభం కాగా మొత్తం 15 బృందాలుగా ఏర్పడిన ఎన్ ఐఎన్ సభ్యులు... స్థానికంగా ఉన్న ఆశ​ వర్కర్లు, ఏఎన్​ఎంలు, వైద్యాధికారుల సహకారంతో ప్రజల నుంచి రక్తాన్ని సేకరించారు.

18 ఏళ్లపైబడిన వారి నుంచి సేకరణ..

గత కొద్ది రోజులుగా స్థానిక అధికారులతో సర్వే కి సంబంధించిన మూడు జిల్లాల్లోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తుండటం వల్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. ఆశించిన దానికంటే ఎక్కువమందే సర్వే కోసం రక్త నమూనాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. ఫలితంగా నాలుగు రోజుల్లో 1200శాంపిళ్లు సేకరించాలని ఎన్​ఐఎన్ భావించినా.. తొలిరోజే అందులో దాదాపు సగం నమూనాలను సేకరించగలిగనట్టు ఎన్​ఐఎన్ అధికారులు చెబుతున్నారు.

18 ఏళ్ల పైబడిన వారిలో మాత్రమే నమూనాలను సేకరిస్తున్నట్టు సర్వే కో ఆర్డినేటర్, పబ్లిక్ హెల్త్ సైంటిస్ట్ డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. ఇక ఆయా శాంపిళ్లను చెన్నైలోని ఎన్​ఐటీఆర్​కు పంపనున్నారు. అక్కడ పరీక్షించి.. సంబంధిత రిపోర్టును ఈ నెల 25లోగ కేంద్ర ప్రభుత్వానికి పంపనన్నట్టు అధికారులు స్పష్ట చేశారు.

త్వరలోనే హైదరాబాద్​లోనూ ఈ నమూనాలను సేకరించనున్నారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో వచ్చిన జిల్లాల ఫలితాలను క్రోడీకంరించటం ద్వారా కరోనా వ్యాప్తిని గుర్తించి.. తదుపరి చర్యలను కేంద్రం చేపట్టనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.